
కడప జిల్లా తెలుగుదేశం ప్రొద్దుటూరు ఇన్చార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇవాళ రాత్రి 8 గంటలకు కడపలోని సబ్ జై నుండి విడుదలయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ప్రవీణ్ 29 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చారు. ప్రవీణ్ విడుదల అవుతుండటంతో తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి దస్తగిరి ,TNTUC జిల్లా అధ్యక్షులు కుతుబుద్దీన్, తెలుగుదేశం పార్టీ BC CL రాష్ట్ర ప్రధాన సెక్రటరీ.తాటి శీను ,TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొందూరు రాజేష్ నాయుడు, , టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు జైలు వద్దకు వచ్చారు. ప్రవీణ్ బయటకు వచ్చినప్పుడు ఒక్కసారిగా అభిమానులు ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.