Type Here to Get Search Results !

స్వాన్ ఇండియా news ప్రొద్దుటూరు ఏప్రిల్ 15 :హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్- నిందితుల్లో ఒకరు జువెనైల్"


స్వాన్ ఇండియా ప్రొద్దుటూరు ఏప్రిల్ 15 :10.04.2026 వ తేదీన రాజుపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్లపాడు గ్రామం, పాత SC కాలనీలో జరిగిన హత్య సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా, ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని త్వరితగతిన చేదించడమైనది.

పిర్యాదుదారు బంగి పురుషోత్తం ఇచ్చిన పిర్యాదు మేరకు రాజుపాళం పోలీస్ స్టేషన్ లో Cr.No.29/2026 U/S 126(2), 115(2), 118(1), 103(1) r/w 3(5) BNS చేసి దర్యాప్తు చేపట్టడమైనది.

> 'సంఘటన వివరాలు*

10.04.2026 వ తేదీ మధ్యాహ్నం సుమారు 02.00 గంటల సమయంలో గ్రామంలోని వీధిలో మోటార్ సైకిల్ వేగంగా నడపడం విషయమై మొదట చిన్నపాటి వివాదం చోటుచేసుకున్నది. గ్రామస్థులు మరియు పిర్యాదుదారు కుటుంబ సభ్యులు చిన్న పిల్లలు ఉన్నందున నిందితుడు బంగి చరణను మందలించగా, అతను ఆ విషయాన్ని అహంకారంగా తీసుకొని వారితో వాగ్వాదానికి దిగినాడు.

ఈ సంఘటనను మనసులో పెట్టుకున్న నిందితుడు తన తల్లిదండ్రులతో కలిసి సాయంత్రం సమయంలో పిర్యాదుదారు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని గొడవను ప్రేరేపించినాడు. సాయంత్రం 06.30 గంటల సమయంలో పిర్యాదుదారు కుమారుడు రవి కుమార్ మరియు కర్ణకుమార్ తిరిగి వస్తుండగా వారిని అడ్డగించి దాడి చేయడం జరిగింది.

అదే రోజు రాత్రి సుమారు 07.00 గంటల సమయంలో, ముందస్తుగా ఏర్పాటుచేసుకున్న ప్రణాళిక ప్రకారం నిందితులు ముగ్గురు కలిసి పిర్యాదుదారు బంగి పురుషోత్తంను వారి ఇంటి ముందు అడ్డగించి కట్టెలతో తీవ్రంగా దాడి చేసి రక్తగాయాలు కలిగించారు. అనంతరం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నప్పుడు వారిపై కూడా దాడి కొనసాగించారు.

ఈ క్రమంలో పిర్యాదుదారు చిన్న కుమారుడు మహేష్ బాబు @ పండు సంఘటన స్థలానికి వచ్చి ఎందుకు తమ కుటుంబ సభ్యులను కొడుతున్నారని అడగగా, నిందితులు అతనిని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలనే సంకల్పంతో పిడిబాకు తీసుకొని గౌంతు వద్ద లోపలికి పొడిచారు. ఈ దాడిలో అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలినాడు. తర్వాత కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

>

"పోలీసుల చర్యలు*:

ఈ సంఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్న ప్రొద్దుటూరు ASP శ్రీ. U.విభూ క్రిష్ణ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ M. నాగభూషణ్ గారి పర్యవేక్షణలో రాజుపాలెం SI G. ప్రణయ్ కుమార్ రెడ్డి మరియు ప్రొద్దుటూరు రూరల్ SI K. శ్రీకాంత్ ల తోటి ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి, నిందితుల అరెస్టు కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టడమైనది. నిందితుల కదలికలను సాంకేతిక ఆధారాలు మరియు మానవ వనరుల ద్వారా విశ్లేషించి, వారు పోలీసులకు చిక్కకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించారు. ఈ క్రమంలో 14.04.2026 వ తేదీన మధ్యాహ్నం 04.30PM గంటలకు నిందితులు ప్రొద్దుటూరు కోర్టు వద్దకు వెళ్లి టెయిల్ ప్యారాలని పోవు సమయంలో చిన్న సిట్టి పల్లె పర్లపాడు గ్రామాలకు మద్యలో ఉన్న కలర్స్ దగ్గర, పోలీస్ బృందాలు అష్టమత్తంగా వ్యవహరించి వారిస్ చుట్టుముట్టి పట్టుకోవడం నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు నేరానికి ఉపయోగించిన వాహనాలను చూపించగా వాటిని సాధీనం జరిగినది పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి యత్నించినప్పటికీ, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణలో నిందితులు చేసుకున్నారు.

> "ముద్దాయిల వివరాలు":

బంగి చరణ్, 17 సం.లు (జువెనైల్), బంగి సురేష్ @ ఏసురాజు, 45 సం.లు, బంగి దేవమ్మ @ బుజ్జి, 41 సం.లు,

పై అందరిది పాత SC కాలనీ, పర్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం,

> "స్వాదీనం చేసుకున్న వస్తువులు*:

పిడి బాకు, రెండు మోటార్ సైకిల్స్.

> "నేరానికి కారణం*:

సాధారణంగా చిన్న విషయమైన మోటార్ సైకిల్ వేగం విషయంలో ప్రారంభమైన వివాదం, పరస్పర అహంకారం, కోపం మరియు పూర్వ కక్ష్య కారణంగా తీవ్రమైన ఘర్షణగా మారింది. కుటుంబాల మధ్య పరస్పర అవగాహన లోపం, తక్షణ ఆవేశం, మరియు చిన్న సమస్యను పెద్దదిగా తీసుకోవడం వల్ల ఈ దారుణమైన హత్యకు దారితీసింది.

ఇది సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తుంది చిన్న చిన్న గొడవలను సహనం తో పరిష్కరించకుండా హింసకు దిగితే భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది.

> 'అభినందనలు *:

ఈ కేసును అత్యంత వేగంగా చేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు ప్రొద్దుటూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ M.నాగభూషణ్ గారిని, రాజుపాలెం SI G. ప్రణయ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు రూరల్ SI K. శ్రీకాంత్ మరియు రాజుపాళెం పోలీస్ స్టేషన్ సిబ్బందిని, ప్రొద్దుటూరు ASP శ్రీ. U.విభూ క్రిష్ణ ఐ.పి.ఎస్ గారు మరియు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి. ఎస్ గారు అభినందించడం జరిగినది.

>

*సూచన / హెచ్చరిక *:

"చిన్న చిన్న విషయాలపై గొడవలు పెట్టుకొని హింసకు దిగడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో శాంతంగా వ్యవహరించి చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి, గొడవ లేదా ప్రమాదం జరిగిన వెంటనే 112 ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేయాలి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిక చేశారు".

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.