Type Here to Get Search Results !

స్వాన్ ఇండియా:మే 31 న ప్రతిభ గల పద్మశాలియ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ

ప్రొద్దుటూరు, ,మే 4, (స్వాన్ ఇండియా): పద్మశాలియ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మే 31 న ప్రతిభ గల పద్మశాలియ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు వద్ది నరసింహులు తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఈ విషయమై కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మే 31ఆదివారం స్థానిక పద్మశాలియ కళ్యాణ మండపంలో 28 వ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ సభ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన ఎంపిసి,  బైపిసి, ఎంఈసి, సిఈసి నందు అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలియ విద్యార్థికి, విద్యార్థినికి ప్రథమ బహుమతి 5000, మెమెంటో, ప్రశంసా పత్రం, ద్వితీయ బహుమతి 4000, మెమెంటో, ప్రశంసా పత్రము మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అన్ని గ్రూపులలో 900 మార్కులు ఆపైన సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతి 3000 నగదు బహుముతి, మెమెంటో, ప్రశంసా పత్రం అందజేయబడునని వివరించారు. అదేవిధంగా 10వ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ మరియు ప్రవేట్ పాఠశాల విద్యార్థికి, విద్యార్థికి ప్రథమ బహుమతి 4000 నగదు బహుమతి, మెమెంట్, ప్రశంసా పత్రం, ద్వితీయ బహుమతి 3000 నగదు బహునుతి, మెమెంటో, ప్రశంసా పత్రము అందజేయబడునని తెలిపారు. 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 450 మార్కులు ఆపైన సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతి 3000 నగదు బహునుతి, మెమెంటో, ప్రశంసా పత్రము అందజేయబడునని పేర్కొన్నారు. ఏపీ ఎంసెట్, నీట్ లో, మెడిసిన్, ఇంజనీరింగ్ నందు మరియు ఐఐటి, జేఈఈ మెయిన్స్ నందు అత్యుత్తమ ర్యాంకు వచ్చిన  విద్యార్థిని, విద్యార్థికి 5000 నగదు ప్రోత్సాహక బహుమతి మెమెంటో, ప్రశంసా పత్రం అందజేస్తామని వివరించారు. 10వ తరగతి టౌన్ ఫస్ట్ అత్యధిక మార్కులు సాధించిన పద్మశాలీయేతర కులస్థులైన విద్యార్థిని, విద్యార్థికి బహుమతి 4000 నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసా పత్రము అందజేయబడునని తెలిపారు. ఈ స్కాలర్షిప్స్ ప్రముఖుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. కావున పైన కనపరచిన అన్ని గ్రూపుల పద్మశాలీయ విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు స్పందించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెంటనే తమ వివరాలను మే 20వ తేది నాటికి పద్మశాలియ కళ్యాణ మండపంలో కానీ, గాంధీ రోడ్డు లోని (5/1114) పద్మశాలియ అభ్యుదయ సంఘం కార్యాలయం నందు కానీ, శ్రీరామ్ నగర్ లోని భావనారుషి ఆలయం ప్రక్కన వున్న తన నివాసంలో కానీ దరఖాస్తులు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9032705866, 9290571411, 9440281069 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలియ అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి వద్ది నాగరాజు, కోశాధికారి అవ్వారు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులు కడప రవి, జింకా శ్రీనివాసులు, సోము జానకి రామయ్య, బోగా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 


ఫోటో పిడిటిఆర్ 1 కరపత్రాలతో పద్మశాలియ అభ్యుదయ సంఘం నాయకులు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.