Type Here to Get Search Results !

కేంద్ర బడ్జెట్లో చేనేతలకు అన్యాయం

స్వాన్ ఇండియా న్యూస్ :(03 ఫిబ్రవరి 2025)ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో చేనేతలకు కేవలం 200 కోట్ల రూపాయలు కేటాయించి చేనేతలకు తీరని అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ తెలిపారు సోమవారం స్థానిక ఎన్జీవో కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతిఏటా బడ్జెట్లో చేనేత రంగానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి చేనేత పరిశ్రమకు తగిన గుర్తింపు ఇవ్వకుండా కేంద్రం మొండి వైఖరి నిర్వహిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తావని హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం ఈ బడ్జెట్లో కేవలం 200 కోట్ల రూపాయలు కేటాయించడం దారుణం అన్నారు. 45 లక్షల గ్రామీణ కుటుంబాలు ఆధారపడిన రంగానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. చేనేత కుటుంబాలకు అవసరమైన విధానాలు కూడా రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మిక కుటుంబాలకు తీరిన అన్యాయం చేసిందని విమర్శించారు. ఇప్పటికే ముడి సరుకులు ధరలు పెరిగి ఒకవైపు ఉత్పత్తి పరికరాలు అందుబాటులో లేక చేనేతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మరోవైపు జీఎస్టీ తో చేనేత రంగం పూర్తిగా పరిస్థితి ఏర్పాటు అయిందని జిఎస్టిని రద్దు చేస్తామని ఎక్కడ చెప్పిన దాఖలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశీయ వస్త్ర మార్కెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెబుతూ కేవలం మాటల్లో తప్ప చేతుల్లో ఎక్కడ లేదని కనీసం ఇప్పటికైనా అధిక సంఖ్యలో బడ్జెట్ కేటాయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమైన చేనేతలకు న్యాయం చేయాలని పార్లమెంటులో ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన గట్టిగా నిలదీసి ప్రధానమైన రంగాలకు అధిక నిధులు రాబట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.