28డిసెంబర్2022:ప్రొద్దుటూరు మండలం, గోపవరం పంచాయతీ నక్కల దిన గ్రామంలో గంగా కావేరి కంపెనీ పత్తి విత్తనాలు వాడి, దాదాపు 62 ఎకరాలలో సాగుచేసిన పత్తి పంట చేతికి రాకపోవడంతో, 26 మంది కౌలు రైతులు నష్టాన్ని చెవి చూసి అప్పుల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే, గంగా కావేరి విత్తనాల కంపెనీ నిర్వాహకులు సదరు ఉద్యోగులచే నక్కలదిన్నె గ్రామంలో దాదాపు 26 మంది కౌలు రైతులను తమ కంపెనీ విత్తనాలను వాడమని చెప్పి ఒప్పించి, ఇందుకుగాను వారికి ముందస్తుగా విత్తనాలు అప్పు ఇచ్చి, పంట చేతికి అందిన నాడు కేజీ పత్తి 100 రూపాయల లెక్కన వారికే తిరిగి అమ్మాలని మాట తీసుకున్నారు. కాగా ఉద్యోగుల మాటలు నమ్మి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన రైతులకు ఐదు నెలల పత్తి పంట ఏపుగా పెరిగినా, ఆశించిన దిగుబడి చేతికి రావటం దేవుడెరుగు కనీసం ఎకరాకు ఒక మూట కూడా పత్తి దిగుబడి రాలేదని, తాము పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు అయి అప్పులు మిగిలాయని కన్నీటి పర్యంతం అయ్యారు.