7వ రోజు 14/01/2023 ప్రోద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఇదేం కర్మ ప్రోగ్రామ్.....
January 14, 2023
0
swan ఇండియా న్యూస్15-01-22 : 7వ రోజు 14/01/2023 ప్రోద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 8 వార్డు శ్రీనివాస్ నగర్ లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డా.జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి.
ప్రొద్దుటూరులో రాక్షస పాలన సాగుతోందని, కనుచూపుమేరలో అభివద్ధి కనపడడం లేదని, హామీల విషయంలో మాట తప్పి ప్రొద్దుటూరు ప్రజలకు మొండి చేయి చూపించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాలనను పక్కనపెట్టి, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రొద్దుటూరు టిడిపిఇన్చార్జ్ డా. జి. వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ప్రొద్దుటూరు నగరంలోని శ్రీనివాస్ నగర్ 8 వార్డు లో ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్కు ప్రవీణ్ మాట్లాడుతూ.ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంవత్సరానికి 500 కోట్లు తెస్తానన్న ఎమ్మెల్యే తెచ్చారా! ప్రొద్దుటూరు ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి మభ్యపెడుతున్న రాచమల్లు అని అన్నారు, ప్రొద్దుటూరు ప్రజలు R. B. K టాక్స్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలిస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదని, ప్రజలందరూ ఓటు వేసి గెలిపించినందుకు ఇదేం కర్మ రా బాబు అంటూ తల పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 8 వార్డు మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, సుర సుర శ్రీనివాసులు, మధు,ఖదీర్, ఘఫుర్, సుర సుర సాలయ్య మాజీ కౌన్సిలర్, రాజకులా యప్ప ,శ్రీనాథ్,వెంకటరమణ,ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు E. V. సుధాకర్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి V. S.ముక్తియార్ గారు, ప్రొద్దుటూరు రూలర్ మండల కన్వీనర్ బోడెల బాబుల్ రెడ్డి,రాజుపాలెం మండలం కన్వీనర్ దనిరెడ్డి విశ్వనాథరెడ్డి,, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి,రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తాటి శ్రీనివాసుల యాదవ్,పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి అయ్యా , కడప పార్లమెంట్ కార్యనిర్వాహ కార్యదర్శి సాన విజయభాస్కర్ రెడ్డి వెలవలి పద్మనాభరెడ్డి,వెంగళయపల్లె శ్రీనివాసులు రెడ్డి,కొర్రపాడు సర్పంచ్ శ్రీనివాసుల రెడ్డి,14 వార్డు మస్తాన్ గోలే, S.M బాషా,TNTUC జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్,తొమ్మిదో వార్డు ,భూన్, టింబర్ డిపో భాష ,పర్లపాడు చంద్ర , ,13 వార్డు నాయబ్,యమ్మనూరు ఆంజనేయులు కడప పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి పల్లా సాయిరాం తెలుగు యువత పట్టణ కార్యదర్శి,అజాం, శ్రీను, గోపవరం గౌస్, భగత్ సింగ్ కాలనీ పట్నం మా భాష కరిముల్లా, ఇర్ఫాన్ పెన్నా నగర్ మజీద్, టిడిపి నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
