9వ రోజు 19/01/2023 ప్రోద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 8 వార్డు కృపా నగర్,స్వరాజ్య నగర్ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ..
January 19, 2023
0
స్వాన్ ఇండియా న్యూస్ 19-01-23 ప్రొద్దుటూరు:9వ రోజు 19/01/2023 ప్రోద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 8 వార్డు కృపా నగర్,స్వరాజ్య నగర్ లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్న ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగదేశం పార్టీ ఇంచార్జి డా.జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి .వైసిపి మూడున్నరేళ్ల పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిత్యవసర ధరలను అమాంతంగా పెంచడంతో ప్రజలు ఇదేం కర్మ అంటూ ప్రశ్నిస్తున్నారని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డా. జీ.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 8 వార్డ్ సంజీవ నగర్ లో ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రజల కష్టాలు తీరాలంటే టిడిపిని గెలిపించాలని కోరారు. అనంతరం.8 వార్డ్ ప్రజలతో కలిసి ఇదేం కర్మ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆయన బామ్మర్ది బంగారెడ్డి అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు పాలన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పాలిట ఖర్మ.అని అన్నారు. ప్రొద్దుటూరు ప్రజలకు రెండు సెంట్లలో ఇండ్లను కట్టించి ఒక చేత ఇంటి తాళాలు మరో చేత ఇంటి పట్టా ఇస్తానని చెప్పారు ఇవ్వలేదు. పొద్దుటూరు ప్రజలకు మోసపూరితమైన మాటలు చెప్పి గత ఎన్నికల్లో గెలిచారని ప్రశ్నించారు.దుర్గంధమైన పరిస్థితులలో సంజీవ్ నగర్ వాసులు జీవిస్తుంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఏ విధంగా నిద్ర వస్తుందో అర్థం కావడం లేదని తెలియజేశారు.
సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ సర్కారు రైతుల నుంచి నేటి వరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు.రైతుల పండించే పంటలకు కూడా కనీసం మద్దతు ధర లేదన్నారు.ఈ కార్యక్రమంలో 8 వార్డు మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, సుర సుర శ్రీనివాసులు, మధు,, , రాజకులా యప్ప ,శ్రీనాథ్, రజక సంఘం వెంకటరమణ,ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు E. V. సుధాకర్ రెడ్డి గారు, టిడిపి నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
