Type Here to Get Search Results !

మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేసవస్వామి శరణాలయం ప్రారంభం

స్వాన్ ఇండియా న్యూస్ 11-02-23 కడప జిల్లా పెద్దముడియం మండలం:కొండసుంకేసుల గ్రామంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేసవస్వామి శరణాలయం ప్రారంభం కొండ సుంకేసుల: స్థానిక పెద్ద ముడియం మండలం:కొండ సుంకేసుల గ్రామములో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి శరణాలయం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీశైలం M.L.A. అయినటువంటి శ్రీ శింగా రెడ్డి చక్రపాణి గారు,నంద్యాల M.L.A. శింగా రెడ్డి రవి చంద్ర కిషోర్ రెడ్డి గారు,కొండసుంకేసుల పిరమిడ్ అధ్యక్షులు శింగా రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూఅందరూ వుంది ఏకాకులుగా మారిన వారు కొందరైతే ...విధి వక్రిoచి ఒంటరి జీవనం గడిపే వారు మరి కొందరు.వృద్దాప్యంలో తోడునీడ లేకుండా ఒక భరోసా కోసం ఎదురు చూసే వారికి,అభాగ్యులకు అండగా నిలిచేందుకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో11.02.2023 నూతనంగా మరో శ్రీ చెన్నకేసవ స్వామి శరణాలయం ఏర్పాటు చేశామని చైర్మన్.మోరే.లక్ష్మణ్ రావు గారు తెలిపారు.శ్రీశైలం M.L.A. చక్రపాణి గారు మాట్లాడుతూ లక్ష్మణ్ రావు గారు చేస్తున్న సేవలు ఎంతో గొప్ప విషయం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్ రావు గారు,కొండసుంకేసుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.