స్వాన్ ఇండియా న్యూస్ 13_02_23 :
జమ్మలమడుగులోని గూడెం చెరువు గ్రామంలో రెండున్నర సంవత్సరాల బాలుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కింద పడిపోయిన గంగన్న ను ఆసుపత్రికి తీసుకొచ్చేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి తన బిడ్డను చంపారని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.