Type Here to Get Search Results !

ఘనంగా టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

స్వాన్ ఇండియా న్యూస్: గురువారం ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో, ప్రొద్దుటూరు లోని ఆయన నివాసం వద్ద పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రవీణ్ రెడ్డి అభిమానులు తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదానం నిర్వహించి, గజమాలతో ఆయనను సత్కరించి, 41 కేజీల భారీ కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, ఎన్నికలలో ప్రొద్దుటూరులో తమ సత్తా చాటుతామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రవీణ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.